ODI World Cup 2023 : 'టీమ్‌ఇండియాకు ఆ సత్తా ఉంది.. అతడు అద్భుతం చేస్తాడు' - వరల్డ్ కప్ ధోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య
🎬 Watch Now: Feature Video
Published : Sep 30, 2023, 7:19 PM IST
ODI World Cup 2023 Chanchal Bhattacharya : మరో ఐదు రోజుల్లో వన్డే వరల్డ్ కప్ 2023 గ్రాండ్‌గా ప్రారంభంకానుంది. అయితే ఈ సారి వరల్డ్ కప్‌ను ముద్దాడే సత్తా రోహిత్ సేనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు మాజీ కెప్టెన్ ధోనీ చిన్ననాటి కోచ్ చంచల్ భట్టాచార్య. రోహిత్ కూల్ పర్సన్ అని, అలాగే జట్టును నడిపించే సమర్థవంతమైన నాయకుడని ప్రశంసించారు. "టీమ్ మంచి బ్యాలెన్స్డ్గా ఉంది. జట్టులో అద్భుత ప్లేయర్స్ ఉన్నారు. కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తే తప్పకుండా జట్టు గెలుస్తుంది. అతడితో పాటు గిల్‌పై గట్టి నమ్మకం ఉంది. అతడు తప్పకుండా ఏదో ఒక పెద్ద అద్భుతమే చేస్తాడు." అని భట్టాచార్య పేర్కొన్నారు. ధోనీ ముందే పసిగట్టగలడు.. "ప్రత్యర్థి జట్టు ఎలాంటి వ్యూహాలు రచించబోతుందో ధోనీ ముందుగానే అంచనా వేయగలడు. మహీకి ఉన్న క్రమశిక్షణ, ఆట పట్ల నిబద్ధతే ఈ రోజు అతడిని ఈ స్థాయిలో నిలబెట్టింది. మాన్సూన్ సీజన్లో ప్రాక్టీస్ చేయడానికి క్లిష్ట పరిస్థితుల్లు ఎదురైతే.. అతడు తన శిక్షణను ఆపేవాడు కాదు. ప్రాక్టీస్ కోసం దిల్లీ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లి మరీ ప్రాక్టీస్ చేసేవాడు. తన స్కిల్స్‌ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండేవాడు" అని భట్టాచార్య ధోనీపై ప్రశంసలు కురిపించారు.
World cup 2023 Team India : కప్ ముందు టీమ్‌ఇండియాకు ఓటమి నేర్పిన పాఠాలు.. ఇక అలా చేస్తే తిరుగుండదు!