బాలికలకు శుభవార్త - డిసెంబర్ 17న ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ - NTR Educational Institutions Scholarship for Girls

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Nov 17, 2023, 9:34 PM IST

NTR Trust Merit Scholarship Test: ప్రతిభ గల విద్యార్థినులకు ఎన్టీఆర్ ట్రస్ట్ మెరిట్ స్కాలర్‌షిప్ టెస్ట్ (NTR Trust Merit Scholarship Test) నిర్వహించనుంది. ఎన్టీఆర్ విద్యాసంస్థలు గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీఈఎస్​టీ (GEST) ఈ సంవత్సరం డిసెంబర్ 17న నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఎన్టీఆర్​ విద్యాసంస్థల ద్వారా ఉపకార వేతనం అందజేయబడుతుందని తెలిపారు. మొదటి 10 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 5 వేల రూపాయల చొప్పున, తరువాతి 15 ర్యాంకులు పొందిన బాలికలకు నెలకు 3 వేల రూపాయల చొప్పున.. ఎన్టీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసేవరకు ఇవ్వబడుతుందని వెల్లడించారు. ఈ సదవకాశాన్ని 10వ తరగతి చదువుతున్న బాలికలందరూ వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు www.ntrcollegeforwomen.education అనే వెబ్ సైట్‌లో నవంబర్‌ 18వ తేదీ నుంచి డిసెంబర్‌ 15వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు మొబైల్ నెంబర్: 7660002627/28 కు సంప్రదించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.