Nara Bhuvaneshwari Mulakat Application Rejected: నారా భువనేశ్వరి చంద్రబాబుతో ములాఖత్‌కు దరఖాస్తు.. తిరస్కరించిన జైలు అధికారులు - రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు
🎬 Watch Now: Feature Video


Published : Sep 15, 2023, 2:19 PM IST
|Updated : Sep 15, 2023, 8:31 PM IST
Nara Bhuvaneshwari Mulakat Application Rejected: రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన సతీమణి నారా భువనేశ్వరి దరఖాస్తు చేయగా అధికారులు తిరస్కరించారు. చంద్రబాబును కలిసేందుకు వారానికి మూడుసార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా సరే.. జైలు అధికారులు తిరస్కరించారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ములాఖత్ పైనా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ములాఖత్‌కు అవకాశం ఉన్నా అధికారులు కాదని అనటంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు తర్వాత రాజమహేంద్రవరంలోనే నారా భుననేశ్వరి ఉంటున్నారు.
అసలెేం జరిగిందంటే: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న చంద్రబాబును ములాఖత్ కోసం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె దరఖాస్తును జైలు అధికారులు తిరస్కరించారు. ఇప్పటికే ఆమె ఓ సారి చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అవకాశం ఉన్న సందర్భంలో కూడా జైలు అధికారులు ములాఖత్‌కు అనుమతివ్వకపోవటంపై.. టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన జైళ్ల శాఖ: రిమాండ్‌లో ఉన్నవారికి వారంలో రెండుసార్లే ములాఖత్ ఇస్తామని... జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ రవికిరణ్ వివరణ ఇచ్చారు. ములాఖత్‌ను ఈ నెల 12, 14 తేదీల్లో ఉపయోగించుకున్నారన్న ఆయన... అత్యవసర పరిస్థితుల్లోనే మూడో ములాఖత్‌కు అనుమతిస్తామని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితి అని చెప్పలేదు కనుక భువనేశ్వరికి ములాఖత్ ఇవ్వలేదని తెలిపారు. అదే సమయంలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాహుల్ 4 రోజుల సెలవుపైనా పత్రికా ప్రకటన విడుదల చేసిన జైళ్ల ఉపశాఖాధికారి... రాహుల్ భార్య కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారని... నిన్న ఉదయం ఆస్పత్రిలో చేరారని చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న భార్యను చూసుకునేందుకు రాహుల్ పెట్టిన 4 రోజుల సెలవు అభ్యర్థనను జైళ్ల శాఖ అంగీకరించిందని వెల్లడించారు. రాహుల్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.