ట్రైన్​ ఎక్కుతూ పట్టాల మధ్య పడ్డ వ్యక్తిని కాపాడిన జవాన్​ - మధ్యప్రదేశ్​ లేటెస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 18, 2022, 3:17 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

రైలు పట్టాల మధ్య చిక్కుకోబోయిన ఓ వ్యక్తిని ఆర్​పీఎఫ్ జవాను చాకచక్యంగా కాపాడాడు. మధ్యప్రదేశ్​ సత్నా జిల్లాలోని మైహర్​ రైల్వేస్టేషన్​లో ఈ ఘటన జరిగింది. దానాపుర్ పుణె ఎక్స్‌ప్రెస్ ట్రైన్​లో పుణెకి వెళ్తున్న ఓ ప్రయాణికుడు నీళ్ల కోసం మైహర్ స్టేషన్‌లో దిగాడు. నీళ్లు పట్టుకుని వెళ్తుండగా అకస్మాత్తుగా ట్రైన్​ కదలటం ప్రారంభించింది. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికుడు రన్నింగ్​ ట్రైన్​ ఎక్కేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను కాలు జారి పట్టాలకు ట్రైన్​కు మధ్య ఇరుకున్నాడు. ఇదంతా చూసిన ఓ ఆర్​పీఎఫ్​ జవాన్​ ఆ వ్యక్తి వద్దకు పరుగులు తీసి అతన్ని సురక్షితంగా బయటకు తీశాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయని జవాన్​ తెలిపాడు.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.