Monkey Viral Video : ఆఫీసర్ కుర్చీలో కూర్చుని ఫైళ్లు తిరగేసిన కోతి.. ఆరటిపండు ఇచ్చినా తలతిప్పకుండా.. - కూర్చిలో కూర్చిని ఫైళ్లు చూసిన కోతి
🎬 Watch Now: Feature Video
Published : Oct 17, 2023, 3:08 PM IST
|Updated : Oct 17, 2023, 5:37 PM IST
Monkey Viral Video : రిజిస్ట్రార్ ఆఫీసులో అధికారి కుర్చీపై కూర్చుని ఫైళ్లు తిప్పుతూ ఓ కోతి హల్ చల్ చేసింది. చుట్టూ అధికారులంతా ఉన్నా ఏ మాత్రం జంకకుండా బిజీబిజీగా గడిపింది. అరటిపండుతో ఆశ చూపినా కనీసం తల తిప్పకుండా.. పనే తన మొదటి ప్రాధాన్యం అన్నట్లు బిల్డప్ ఇచ్చింది. అరటిపండు ఒలిచి ఇచ్చినా.. తనను డిస్టర్బ్ చేయొద్దన్నట్లు ఫైళ్లు తిరగేసే పనిలో నిమగ్నమైపోయింది. ఉత్తర్‌ప్రదేశ్.. సహారన్‌పుర్ జిల్లా బెహట్ మండలం తహసీల్ రిజస్ట్రీ డిపార్ట్మెంట్ కార్యాలయంలో అక్టోబర్ 12న ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై సహారన్‌పుర్ సబ్‌కలెక్టర్ దీపక్‌కుమార్ స్పందించారు. ఈ వైరల్ వీడియో తహసీల్ కార్యాలయం పరిసరాల్లో జరిగిందని ధ్రువీకరించారు. కొద్దిసేపటి తర్వాత కోతి తనంతట తానే వెళ్లిపోయిందని తెలిపారు. ఆ వానరం కాగితాలకు, ఫైళ్లకు ఎలాంటి నష్టం కలిగించలేదని చెప్పారు. అయితే తహసీల్ కార్యాలయం ఆవరణలోకి తరచూ కోతులు వస్తున్నాయని.. కానీ కార్యాలయం లోపల కూర్చీపై కూర్చోవడం ఇదే తొలిసారి అని తెలిపారు.