thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 5:13 PM IST

ETV Bharat / Videos

Monkey Cries Near Deadbody Viral Video : 'రైతన్నా.. ఎక్కడికి వెళ్లిపోయావ్​?'.. మృతదేహం వద్ద ఏడ్చిన కోతి!

Monkey Cries Near Deadbody Viral Video : సాధారణంగా కోతులు అల్లరి పనులు చేస్తాయి. గుళ్ల దగ్గర భక్తులను భయపెడతాయి. కానీ ఉత్తర్​ప్రదేశ్​లోని లఖింపుర్​ ఖేరి జిల్లాలో ఓ కోతి చేసిన పని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైతు మృతదేహం వద్ద కూర్చుని ఓ వానరం ఏడ్చింది. అంత్యక్రియలు అయ్యేవరకు మృతుడి ఇంటి వద్దే ఉంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ అవుతోంది.

అసలేం జరిగిందంటే?
మృతుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. లఖింపుర్ ఖేరి జిల్లాలోని భీరా పోలీస్​స్టేషన్​ పరిధిలోని గోంధియా గ్రామానికి చెందిన చందన్​ వర్మ అనే రైతుకు ఊరి శివార్లలో వ్యవసాయ భూమి ఉంది. రోజూ పొలం పనులు అయ్యాక అతడు భోజనం చేసే సమయంలో ఓ కోతి చందన్​ దగ్గరకు వచ్చేది. రైతు తెచ్చిన ఆహారాన్ని వానరం కూడా తినేది. అలా రైతు, కోతి స్నేహితులుగా మారారు. కొన్నినెలల క్రితం పక్షవాతం బారినపడ్డ రైతు.. శనివారం మృతి చెందాడు. దీంతో అతడి బంధువులంతా చందన్​ వర్మ ఇంటికి చేరుకున్నారు.

ఇంతలో ఆ కోతి.. రైతు ఇంటికి వచ్చింది. చందన్​ వర్మ మృతదేహంపై కప్పి ఉన్న బెడ్​షీట్​ను తీసి అతడిని చూసింది. అప్పటి నుంచి అక్కడే కూర్చుని ఏడ్చింది. అయితే తమ మధ్యలోకి కోతి వచ్చి కూర్చోవడం వల్ల తొలుత భయాందోళనకు గురయ్యామని మృతుడి బంధువులు తెలిపారు. తమపై కోతి ఎలాంటి దాడి చేయలేదని చెప్పారు. చందన్​ వర్మ అంత్యక్రియలు జరిగే వరకు కోతి ఇక్కడే ఉందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.