Money Stolen From Parked Car Viral Video : పార్క్​ చేసిన కారులోని రూ.13 లక్షలు చోరీ.. పట్టపగలే అద్దం పగలగొట్టి.. - కారు అద్దం పగలగొట్టి దొంగలించిన వ్యక్తి

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 3:43 PM IST

Money Stolen From Parked Car Viral Video : రోడ్డుపై పార్క్​ చేసి ఉన్న కారులోని రూ.13 లక్షలు చోరీ చేశాడు ఓ వ్యక్తి. కారు అద్దం పగలగొట్టి లోపలకు చొరబడి మరీ డబ్బును దొంగలించాడు. అక్కడే ద్విచక్రవాహనంపై ఉన్న మరో వ్యక్తితో వెంటనే పరారయ్యాడు. కర్ణాటకలోని బెంగళూరులో పట్టపగలే ఈ ఘటన జరగడం గమనార్హం.

పక్కా ప్లాన్​తో చోరీ!
Money Stolen From Car : ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోను బెంగళూరు పోలీసులు.. సోమవారం విడుదల చేశారు. సెప్టెంబరు 20వ తేదీన ఈ చోరీ జరిగినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే చోరీకి పాల్పడేందుకు నిందితుడు పక్కా ప్లాన్​ వేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. 

కారులో ఉన్న డబ్బు సంచిను దొంగలించేందుకు వచ్చిన నిందితుడు.. అక్కడే కాసేపు అటూఇటూ తిరగాడు. జనసంచారం లేని సమయంలో ఒక్కసారిగా తాను తెచ్చుకున్న చిన్నపాటి ఆయుధంతో కారు అద్దం పగలగొట్టాడు. ఆ తర్వాత డ్రైవర్​ పక్క సీటులో ఉన్న బ్యాగ్​ను చోరీ చేసేందుకు నిందితుడు.. ఎగిరి మరీ కారులోకి చొరబడ్డాడు. వెంటనే డబ్బుల బ్యాగ్​ను తీసుకుని.. అక్కడే బైక్​పై ఉన్న మరో వ్యక్తితో కొన్ని సెకన్లలోనే పరారయ్యాడు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.