కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష : సబితా ఇంద్రారెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video


Published : Nov 28, 2023, 3:50 PM IST
Minister Sabitha Indra Reddy on Telangana Development : మహేశ్వరం నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్.. తెలంగాణకు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ నాయకులు కేసీఆర్‌ను నిలువరించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా... చేసిన అభివృద్ధి పనులే బీఆర్ఎస్ను గెలిపిస్తాయన్నారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు తనని గెలిపించాలని ఆమె కోరారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా.. తెలంగాణ సమాజం కేసీఆర్ వెనుకనే ఉన్నారని గుర్తుచేశారు.
BRS Party Election Campaign: కేసీఆర్ నాయకత్వమే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్షగా మంత్రి అభివర్ణించారు. వైద్యరంగంలో ఉన్నత మార్పులను.. విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని ఉద్ఘాటించారు. విద్యావ్యవస్థలో సైతం 'మన ఊరు మన బడి పథకం' కింద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నట్లు వివరించారు. ప్రజలు ఓటు వేసేందుకు వెళ్లే ముందుకు గ్యాస్ బండ్‌కు దండం పెట్టుకొని పెరిగిన నిత్యావసర ధరలను తలుచుకొని ఓటు ఎవరికి వేస్తే లాభమో ఆలోచించాలన్నారు.