Minister Puvvada Ajay React on Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్టును ఖండించిన మంత్రి పువ్వాడ - Puvvada Ajay condemned Chandrababu arrest

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 5:48 PM IST

Telangana Minister Puvvada Ajay Condemned Chandrababu Arrest : స్కిల్​ డెవలప్​మెంట్​ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ.. దేశంలోని జాతీయ నేతలు నిరసన గళమెత్తారు. ఆయనను జైలులో పెట్టడంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఏపీ ప్రభుత్వం చేస్తున్న పనిని పూర్తిగా తప్పుబట్టారు.. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తి విరుద్ధమన్నారు.

తాజాగా చంద్రబాబు అరెస్టు బాధాకరమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్​ అన్నారు. ఆయన అక్రమ అరెస్టును ఖండిస్తున్నానని తెలిపారు. గవర్నర్​ అనుమతి లేకుండా.. మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రులు పాలనలో అనేక నిర్ణయాలు తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రజావసరాల కోసం కూడా సీఎంలు అనేక నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు.

రాజకీయాల్లో కక్ష సాధింపు చర్యలు మంచివి కావని మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ విమర్శించారు. అంతకు ముందు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్​ రెడ్డి, బండి సంజయ్​, లక్ష్మణ్​ కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్​ నుంచి భట్టి విక్రమార్క స్పందించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.