Marriage Fear Counseling : 'పెళ్లంటే నూరేళ్ల మంట' అని భయపడుతున్నారా? ఈ నిపుణుల సలహాలు మీకోసమే!

🎬 Watch Now: Feature Video

thumbnail

How To Get Out Of Marriage Fear : పెళ్లి అనేది ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. అలాంటిది ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆ పెళ్లి అనే క్రతువులోకి దిగడానికి భయపడుతున్నారు. ఇందుకు కారణం మన చుట్టూ ఉండే కుటుంబాల తరచూ గొడవలు పడుతుండటం, ఇది కాస్త విడాకుల వరకు దారితీయడమే అని అంటున్నారు మానసిక నిపుణులు. అయితే ఇలాంటి పరిస్థితులు అందరి జంటల మధ్య కనబడవని.. భార్యభర్తలు ఇద్దరి మధ్య ఉండే అవగాహన, అర్థం చేసుకునే తీరుపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. కేవలం విఫలమైన కుటుంబాల కథలను మాత్రమే భుతద్దంలో పెట్టి చూడవద్దని.. దంపతులు అన్యోన్య జీవతాలకు సంబంధించి సక్సెస్​ స్టోరీస్​ను కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచిస్తున్నారు సైకాలజిస్ట్​ కేవీ శ్రీనివాస్​. తల్లిదండ్రులు మీకు ఒక వయసు వచ్చేంత వరకు మాత్రమే మిమ్మల్ని సంరక్షించగలరు, పోషించగలరు. అదే పెళ్లి చేసుకొని మీ జీవితభాగస్వామితో హాయిగా ఉంటే వారు జీవితాంతం మీకు తోడుగా ఉంటారని అంటున్నారు డాక్టర్​ శ్రీనివాస్​. అయితే పెళ్లి విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని.. అలాంటివి ఏమైన ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా మానసిక నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు సైకాలజిస్ట్​ కేవీ శ్రీనివాస్​.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.