Maoist Katakam Sudarshan : గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి - Kattam Sudarshan history
🎬 Watch Now: Feature Video
Maoist Katakam Sudarshan Died : ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ మావోయిస్టుల పొలిటికల్ బ్యూరో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఆనంద్ అలియాస్ కట్టం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతిపై సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. మే 31న మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మృతి చెందినట్లు తెలిపారు. మరణానంతరం పొలిట్‌బ్యూరో ఛాయా చిత్రాలను కూడా విడుదల చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా ఆనంద్ సంస్మరణ సమావేశాలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సుదర్శన్ మృతితో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సుదర్శన్ బాల్య స్నేహితులతో పాటు పట్టణంలోని ఆయా పార్టీల నాయకులు ఉదయం నుంచి ఆనంద్ ఇంటికి వచ్చి సంఘీభావం తెలిపారు. 1978 సమయంలో తిరుగుబాటుతో పీపుల్స్ వార్ పార్టీ పట్ల సుదర్శన్ ఆకర్షితులయ్యారు. పీపుల్స్ వార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కుందేళ్ల శంకర్, దస్తగిరిలను హత్య చేసిన కమిటీలో ఉన్నాడు. అనంతరం పార్టీ జిల్లా కమిటీ సభ్యునిగా ఉద్యమ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి.. మృతి చెందే వరకు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు.