మణిపుర్ అమానుష ఘటనపై కుకీల భారీ ర్యాలీ.. న్యాయం కోసం డిమాండ్​ - మణిపుర్ ఆందోళనలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2023, 7:54 PM IST

Manipur Woman Paraded Incident : మణిపుర్​లో​ ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి ఊరేగించి.. అనంతరం అత్యాచారం చేశారన్న ఆరోపణలపై అక్కడి కుకీలు భగ్గుమన్నారు. మే 4న జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అమానుష ఘటనపై.. భారీగా ఆందోళలు చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గురువారం చురచంద్‌పుర్​ జిల్లాలో భారీ ర్యాలీ తీసి నిరసనకు దిగారు. నిందితులను వెంటనే అరెస్ట్​ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు.

ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన వేళ.. మణిపుర్​ రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ దారుణంపై కిడ్నాప్, అత్యాచారం, హత్యాయత్నం కేసు నమోదు చేసి.. వైరలైన వీడియోల ఆధారంగా ఒక నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అతడ్ని హురేమ్ హెరోదాస్ సింగ్ (32)గా గుర్తించారు. మహిళలపై దారుణంగా వ్యవహరించిన ఈ ఘటనపై.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఘాటుగా స్పందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఘటనకు పాల్పడిన వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని తెలిపారు. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఘటనను సుమోటోగా స్వీకరించింది.  

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.