బస్సును ఢీకొట్టిన బైక్.. మంటలు చెలరేగి వాహనాలు దగ్ధం - బైక్ ప్రమాదం
🎬 Watch Now: Feature Video
ACCIDENT: కర్ణాటకలోని మంగళూరులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నగరంలోని హంపన్‌కట్ట సిగ్నల్ వద్ద ఓ బస్సును, బైక్ ఢీకొట్టింది. మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. హంపన్‌కట్ట సిగ్నల్‌ను బస్ దాటుతున్న సమయంలో వలెన్సియా వైపు వెళ్తున్న బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్రవాహనంలోని పెట్రోల్ ట్యాంక్ పగిలి చమురు మొత్తం బస్సు టైర్ల కిందకు వెళ్లింది. వెంటనే బైక్ ట్యాంకర్ పేలటం వల్ల రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బల్లాల్ బాగ్‌కు చెందిన బైకర్ డైలాన్(26)కు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులోని ప్రయాణికులు వెంటనే దిగిపోవటం వల్ల ప్రాణనష్టం తప్పింది.