ఫైర్ హెయిర్ కట్ చేస్తుండగా ప్రమాదం - ఫైర్ హెయిర్ కట్ యువకుడికి గాయాలు
🎬 Watch Now: Feature Video
ఫైర్ హెయిర్ కట్ కోసం సెలూన్‌కు వెళ్లిన ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని వాపి ప్రాంతానికి చెందిన బాధితుడు.. బుధవారం ఫైర్ హెయిర్ కట్ కోసం స్థానికంగా ఉన్న సెలూన్‌కు వెళ్లాడు. ప్రక్రియలో భాగంగా బాధితుడి జట్టుకు రసాయనం పూసి నిప్పు అంటించాడు సెలూన్ యజమాని. అయితే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. తీవ్రగాయాలపాలైన యువకుడిని స్థానికులు వాపిలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి సూరత్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఫైర్ హెయిర్‌కట్ కోసం సెలూన్ యజమాని ఏ రసాయనాన్ని ఉపయోగించాడనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST