దాహంతో అల్లాడిన పాము.. నీళ్లు తాగించిన ఆఫీసర్.. లైవ్ వీడియో..
🎬 Watch Now: Feature Video
Man Giving Water To Cobra : ఎండల తీవ్రతకు మనుషులతో పాటు పక్షులు, జంతువులు కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాయి. అలా మండుటెండకు అలసిపోయిన ఓ నాగుపాముకు.. ఒక అటవీ శాఖ అధికారి, పాముల సంరక్షకుడు నీళ్లు తాగించాడు. పాము కూడా తన దాహాన్ని తీర్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది.
ఇదీ జరిగింది.. దెహ్రాదూన్ జిల్లాలోని వికార్‌నగర్ ప్రాంతంలో ఓ నాగుపాము తీవ్రమైన ఎండకు అలసిపోయింది. అది పసిగట్టిన కాల్సి ఫారెస్టు డివిజన్‌కు చెందిన చౌదాపుర్ రేంజ్ అధికారి ముకేశ్ కుమార్.. బాటిల్లో నీళ్లు తీసుకొచ్చి పాముకు తాగించాడు. దాని తల నిమురుతూ నీళ్లు తాగించాడు. పాము కూడా ఎటూ కదలకుండా, భయపడకుండా.. శ్రద్ధగా నీళ్లు తాగింది. దీన్ని అక్కడే ఉన్న కొంత మంది తమ కెమెరాల్లో బంధించారు. ఇంతకుముందు కూడా ముకేశ్ పలు సందర్భాల్లో విష సర్పాలకు నీళ్లు తాగించాడు. అయితే ఎండలకు తట్టుకోలేక నీళ్లు వెతుక్కుంటూ పాములు ఇళ్లల్లోకి వస్తాయని.. అలాంటప్పుడు వాటిని పట్టుకోకుండా.. అటవీ అధికారులకు, పాముల సంరక్షులకు సమాచారం ఇవ్వాలని ముకేశ్ విజ్ఞప్తి చేశాడు.