ట్రైన్ ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య.. శవాన్ని 5 కిలోమీటర్లు లాక్కెళ్లిన రైలు - ట్రైన్ కింద దూకి ఆత్మహత్య
🎬 Watch Now: Feature Video
ఉత్తర్‌ప్రదేశ్ అమ్రోహాలో దారుణ ఘటన జరిగింది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహాన్ని 5 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది రైలు. దీంతో అతడి రెండు కాళ్లు.. మోకాళ్ల వరకు తెగిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని ఇంజిన్‌ను నుంచి తొలగించారు. మృతుడిని దెహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచఖోరా గ్రామానికి చెందిన గుర్వీందర్ సింగ్‌గా గుర్తించారు.
గుర్వీందర్ సింగ్ అమ్రోహాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితం పెళ్లి కాగా.. ఏడేళ్ల కూతురు, నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా దంపతుల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే సోమవారం పనికి వెళ్తుండగా.. భార్యతో మరోసారి గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన గుర్వీందర్ సింగ్.. కైలసా రైల్వే స్టేషన్‌కు వెళ్లి ట్రైన్ ముందు దూకాడు. అతడి మృతదేహం ఇంజిన్‌లో ఇరుక్కుపోగా.. సుమారు 5 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది రైలు.