Woman played cricket with Her daughter : సాధారణంగా పిల్లలతో కలిసి తల్లిదండ్రులు పరీక్షలు, పోటీ పరీక్షలు రాయడం లాంటి ఘటనలు అనేక సందర్భాల్లో చూస్తుంటాం. కానీ క్రికెట్ ఆడటం మీరెప్పుడైనా చూశారా? అలాంటిదే ఈ స్టోరీ. తన కుమార్తెకు ఇష్టమైన క్రికెట్ రంగంలో రాణించేందుకు ప్రోత్సహించడమే కాకుండా తల్లి కూడా బరిలోకి దిగి మ్యాచ్ ఆడారు. ఈ అరుదైన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఇంతకీ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
కుమార్తెను క్రికెట్ రంగం వైపు ప్రోత్సహించేందుకు : విద్యార్థిని తల్లి పద్మ సీనియర్ మహిళా క్రికెటర్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు నిర్వహించిన లీగ్ పోటీలో పాల్గొంది. పలు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆమెకు ఉంది. పద్మ కుమార్తె భవానీ కూడా ఇప్పుడు క్రికెట్ మైదానంలో దిగింది. 8వ తరగతి చదువుతున్న ఈ బాలిక ఇప్పటికే స్కూల్ గేమ్స్‌తో పాటు అసోసియేషన్ క్రికెట్ పోటీల్లో రాణిస్తోంది. ఈ క్రమంలోనే భవానీని ఆమె తల్లి కూడా ప్రోత్సహిస్తోంది. ఆమెను క్రికెట్ రంగంలో రాణించే విధంగా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కోసారి కుమార్తెను ప్రోత్సహించేందుకు తను కూడా బరిలో దిగి మ్యాచ్‌లను ఆడుతున్నారు.
ఆమె కుటుంబ నేపథ్యం వ్యవసాయంతో ముడిపడి ఉండటం వల్ల వారు కోదాడలో ఉంటున్నారు. క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు మంగళవారం తల్లీ, కుమార్తెలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియానికి వచ్చారు. ఈ క్రమంలోనే ఇలా క్రికెట్ ఆడుతూ కనిపించారు. పిల్లలను వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇంటర్ జోనల్ పీడీ టీ20 క్రికెట్ ప్రారంభం - తొలి మ్యాచ్‌లో సౌత్‌జోన్‌పై నార్త్‌జోన్ విజయం
యువకులతో క్రికెట్ ఆడిన మాజీ మంత్రి మల్లారెడ్డి - బ్యాటింగ్ చేసి అందరినీ ఉత్సాహపరిచిన వీడియో వైరల్