రివర్స్​ గేర్​లో డ్రైవింగ్​ పోటీలు.. ఫీట్లు అదిరిపోయాయిగా - మహారాష్ట్ర ఆటో రిక్షా లేటెస్ట్​ న్యూస్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 25, 2023, 9:31 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. అలానే మహారాష్ట్రలో వినూత్న రీతిలో ఆటో రిక్షా డ్రైవింగ్​ పోటీలు జరిగాయి. సాంగ్లీ జిల్లాలోని హరిపుర్​ అనే గ్రామంలో ఈ వింత పోటీలను నిర్వహించారు. సంగమేశ్వర్ యాత్రలో భాగంగా రివర్స్​ గేర్​లో వెనుకకు​ ఆటో పోటీలను నిర్విహించారు. ఈ పోటీల్లో కొంత మంది ఆటో రిక్షా డ్రైవర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వింత పోటీలను చూడడానికి చుట్టుపక్కల ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ పోటీల్లో ఓ చిన్న ప్రమాదం కూడా జరిగింది. ఓ పోటీదారుడు ఆటోను వెనుకకు నడుపుతుండగా.. అది బ్యాలెన్స్​ కోల్పోయింది. దీంతో ఆ ఆటో రిక్షా బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదంలో డ్రైవర్​ సురక్షితంగా బయటపడం వల్ల అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ పోటీలు కేవలం వినోదం కోసం మాత్రమే నిర్వహించామని.. రోడ్లపై ఇటువంటి ఫీట్లు చేయవద్దని పోటీ నిర్వహకులు హెచ్చరించారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.