ICC Hall of Fame Criteria : ప్రపంచంలో ఏ క్రికెటర్ అయినా 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కించుకోవాలని ఆశపడుతుంటాడు. క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లకు గుర్తింపుగా వారిని ఈ లిస్ట్‌లో యాడ్ చేస్తుంటారు. అయితే అసలీ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏమిటి? దీన్ని ఎవరు, ఎప్పుడు నుంచి ఇస్తున్నారు? ఎంత మంది భారతీయులు 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు సంపాదించుకున్నారు? తదితర విషయాలు తెలుసుకుందాం.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏమిటి?
క్రికెట్లో లెజెండరీ ప్లేయర్లకు గుర్తింపుగా, గౌరవసూచకంగా 2009లో ఐసీసీ ఈ 'హాల్ ఆఫ్ ఫేమ్'ను తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెజెండరీ క్రికెటర్లకు ఇందులో చోటు కల్పించి గౌరవిస్తోంది. అంతర్జాతీయ క్రికెటర్స్ అసోసియేషన్స్ సమాఖ్య (FICA) సహకారంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో ప్లేయర్లకు చోటు కల్పిస్తోంది. ఐసీసీ ఏర్పడి వందేళ్లు పూర్తైన సందర్భంగా 2009 జనవరి 2నుంచి ఈ లిస్ట్‌లో ప్లేయర్లకు చోటు కల్పించడం ప్రారంభించింది. 2009లో ఒకేసారి 55మందికి ఐసీసీ ఇందులో చోటు దక్కింది. ఐసీసీ వార్షిక అవార్డుల కార్యక్రమంలో దీనిపై ప్రకటనలు కూడా చేస్తుంటారు.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోవడానికి ప్రమాణాలు?
'హాల్ ఆఫ్ ఫేమ్' గౌరవం కోసం ఎంపిక చేయనున్న ప్లేయర్ల గురించి ఓటింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఇదివరకే 'హాల్ ఆఫ్ ఫేమ్'లో భాగమైనవారు, అంతర్జాతీయ క్రికెటర్స్ అసోసియేషన్స్ సమాఖ్య సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, మీడియా ప్రతినిధులు, ఐసీసీ సమక్షంలో జరుగుతుంది.
అర్హతలు
- క్రికెటర్ ఆటకు గుడ్‌బై చెప్పిన ఐదేళ్లు తర్వాత 'హాల్ ఆఫ్ ఫేమ్'లోకి చోటు దక్కించుకోవడానికి అర్హత సాధిస్తాడు.
- ఒక బ్యాటర్ రెండు ప్రధాన ఫార్మాట్లలో (వన్డే/టెస్టు) కనీసం 8,000 పరుగులు, 20 సెంచరీలు చేసి ఉండాలి. ఏదైనా ఫార్మాట్లో 50 కంటే ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ ఉండాలి.
- బౌలర్లు ఏదైనా ఒక ఫార్మాట్లో కనీసం 200 వికెట్లు తీసి ఉండాలి. కానీ టెస్టులు, వన్డేల్లో స్ట్రైక్ రేట్ వరుసగా వరుసగా 50, 30 కంటే తక్కువగా ఉండాలి.
- వికెట్ కీపర్ వన్డే లేదా టెస్టుల్లో ఏదో ఒక ఫార్మాట్లో 200 ఔట్స్ చేసి ఉండాలి.
- కెప్టెన్‌కు 'హాల్ ఆఫ్ ది ఫేమ్'లో చోటు దక్కాలంటే అతడు కనీసం 25 టెస్టులు, 100 వన్డేల్లో 50 కంటే ఎక్కువ శాతం విజయాలను నమోదు చేయాలి.
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో 10 మంది ఇండియన్ ప్లేయర్స్ వీరే :
- సునీల్ గావస్కర్
- బిషన్ సింగ్ బేడీ
- కపిల్ దేవ్
- అనిల్ కుంబ్లే
- రాహుల్ ద్రవిడ్
- సచిన్ తెందూల్కర్
- వినో మన్కడ్
- డయానా ఎడూజీ
- వీరేంద్ర సెహ్వాగ్
- నీతూ డేవిడ్
115 మందికి చోటు
భారత్‌కు చెందిన 10 మందితో సహా 115 మందికి ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చోటు దక్కింది. ఏబీ డివిల్లీయర్స్, అలెస్టర్ కుక్, షాన్ పొలాక్, జయవర్ధనే, కుమార సంగర్కర, షేన్ వార్న్, స్టీవ్ వా తదితరులు ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నారు.
Highest run-scorer in the history of Test cricket ✅
— ICC (@ICC) July 18, 2019
Highest run-scorer in the history of ODI cricket ✅
Scorer of 100 international centuries 💯
The term 'legend' doesn't do him justice. @sachin_rt is the latest inductee into the ICC Hall Of Fame.#ICCHallOfFame pic.twitter.com/AlXXlTP0g7
పాక్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఓపెనింగ్ సెర్మనీ- BCCI ఆలోచనేంటి? రోహిత్ వెళ్తాడా?
ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్స్‌కు వైట్ సూట్స్ ఎందుకు ఇస్తారో తెలుసా?