America Students Visa : ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ పూర్తిచేసి ఉన్నతవిద్యను అభ్యసించేందుకు అమెరికా, కెనడాలకు వెళ్తున్న విద్యార్థుల వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షల ప్రభావం ఉండదని ఈటీఎస్ (ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్) సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ తెలిపారు. ఉన్నత విద్య పూర్తిచేశాక అక్కడి నిబంధనల పాటిస్తూ ఉద్యోగాలూ చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఈటీఎస్ ప్రధాన కార్యాలయాన్ని జనరల్ మేనేజర్ రత్నేష్‌ఝాతో కలిసి గురువారం రోహిత్ శర్మ ప్రారంభించారు.
విద్యార్థుల సంఖ్య పెరుగతూనే ఉంది : ఈ సందర్భంగా టోఫెల్, జీఆర్‌ఈ పరీక్షల్లో రాబోతున్న మార్పులు, విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల్లో భాషా ప్రావీణ్యాలు పెంపొందించేందుకు ఈటీఎస్ చేపట్టిన కార్యాచరణ వివరాలను రోహిత్ శర్మ వివరించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా, కెనడాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని, ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులను అంచనా వేసుకుని అక్కడికి వెళ్లకూడదనే నిర్ణయానికి రావడం సరైంది కాదు అని అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం అక్కడి యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నాయి.
ఆందోళనలు సహజం : అందుకే అమెరికా సహా విదేశాలకు వెళ్లాలనుకుంటున్న అభ్యర్థుల సౌకర్యార్థం వారి అభిరుచులకు అనుగుణంగా టోఫెల్, జీఆర్‌ఈ నిర్వహిస్తున్నట్లు ఈటీఎస్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ శర్మ తెలిపారు. ఇంజినీరింగ్, వైద్యం, ఫార్మా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ఉద్యోగాలు తగ్గే అవకాశాలున్నాయన్న ఆందోళనలు సహజం కానీ అవి తాత్కాలికమేనన్నారు. వేరే రూపంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకే గ్లోబల్ కేపబులిటీ సెంటర్(జీసీసీ) పేరుతో హైదరాబాద్‌లో ఓ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.
షార్ట్ టర్మ్ కోర్సు : ఈటీఎస్ ఆధ్వర్యంలో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ పద్ధతుల్లో 40 గంటల నుంచి 120 గంటలపాటు ఆంగ్లభాషలో మెలకువలు నేర్పించేలా కూడా శిక్షణ ఇవ్వానున్నట్లు ఈటీఎస్ జనరల్ మేనేజర్, రత్నేష్ ఝా తెలిపారు. రూ.1500-2000 ఫీజుతో ఇచ్చే ఈ షార్ట్ టర్మ్ కోర్సు హైదరాబాద్‌లోని లక్షల మందికి ఉపయుక్తంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.
వలస జీవులను వణికిస్తున్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత్‌పై ప్రభావం పడనుందా?
అమెరికా వెళ్లాలనుకునేవారికి గుడ్‌న్యూస్- వీసా ప్రాసెస్ ఇక ఈజీ! ట్రంప్ లేటెస్ట్ ప్రకటన విన్నారా?