Sonu Sood Fraud Case : ఫ్రాడ్ కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడం వల్ల పంజాబ్‌లోని లుథియానా కోర్టు తాజాగా సోను సూద్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ నెట్టింట ఓ పోస్ట్ పెట్టారు.
"సోషల్ మీడియాలో నాపై వస్తున్న వార్తల గురించి మీకు క్లారిటీ ఇవ్వాలి. ఈ విషయాన్ని సూటిగా చెప్పాలంటే నాకు ఎటువంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిపించింది. మా లాయర్లు కోర్టుకు సమాధానమిచ్చారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఫిబ్రవరి 10న వెల్లడిస్తాను. నా ప్రమేయం లేని విషయాల గురించి మీ అందరికీ అప్పుడు స్పష్టంగా వివరిస్తాను. ఆ కేసుకు, నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తోంది. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం ఎంతో బాధాకరం" అని ఆవేదన వ్యక్తం చేశారు.
We need to clarify that the news circulating on social media platforms is highly sensationalised. To put matters straight, we were summoned as a witness by the Honourable Court in a matter pertaining to a third party to which we have no association or affiliation. Our lawyers…
— sonu sood (@SonuSood) February 7, 2025
ఏమైందంటే?
లుథియానాకు చెందిన రాజేశ్ ఖన్నా అనే న్యాయవాది తనను మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో ఇన్వెస్ట్మెంట్ చేయించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఆ లాయర్ సోనూ సూద్‌ను సాక్షిగా పేర్కొన్నారు. ఇక ఈ కేసును విచారణ చేపట్టిన కోర్టు, ఆ తర్వాత సోనూ సూద్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.
"సోనుసూద్‌కు మేము పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతడు కోర్టుకు రాలేదు. దీంతో వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి" అని మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 10న ఈ కేసును మరోసారి విచారణకు రానుంది.
Punjab | Ludhiana's Judicial Magistrate Ramanpreet Kaur has issued an arrest warrant against Bollywood actor Sonu Sood.
— ANI (@ANI) February 6, 2025
The summon has been issued in connection with a fraud case of Rs 10 lakh filed by a Ludhiana-based lawyer Rajesh Khanna against one Mohit Shukla, in which he… pic.twitter.com/XjXA2YVBw1
ఇక సోనూ సూద్ తాజాగా ఆయన డైరెక్టర్‌గా 'ఫతేహ్' అనే సినిమాను తెరకెక్కించారు. దానికి ఆడియెన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సైబర్ మాఫియా కథ నేపథ్యంలో ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. నసీరుద్దీన్ షా, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, విజయ్ రాజ్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.
రూ.74 రెమ్యూనరేషన్ కోసం సినిమాల్లోకి వచ్చిన స్టార్ కిడ్ - కట్ చేస్తే ఇండస్ట్రీలో టాప్ హీరో ఈయనే!
అభిమానిని కొట్టిన సీనియర్ యాక్టర్ - ఆ తర్వాత క్షమాపణలు! - అసలేం జరిగిందంటే?