ETV Bharat / international

ట్రంప్ 'తగ్గేదేలే'- ఇంటర్నేషనల్​ క్రిమినల్ కోర్టుపై ఆంక్షలు- 9700 మంది ఉద్యోగులు తొలగింపు! - TRUMP SANCTIONS ICC

డొనాల్డ్ ట్రంప్ దూకుడు- అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుపై ఆంక్షలు విధించిన అధ్యక్షుడు

trump sanctions icc
trump sanctions icc (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2025, 10:05 AM IST

TRUMP SANCTIONS ON ICC : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు కొనసాగిస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుపై ఆంక్షలకు దిగారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై సంతకం చేశారు. అమెరికా, దాని మిత్రదేశం ఇజ్రాయెల్‌ లక్ష్యంగా నిరాధార దర్యాప్తులు చేపడుతోందని ఈ సందర్భంగా ట్రంప్ విమర్శించారు.

ఇజ్రాయెల్ ప్రధానిపై అరెస్ట్ వారెంట్ నేపథ్యంలో!
ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూపై అరెస్టు వారెంట్‌ జారీ చేసి అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు తన అధికారాలను దుర్వినియోగం చేసిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అధికారులు అమెరికాలో ప్రవేశించకుండా వారిపై నిషేధాజ్ఞలు అమలు అవుతాయి.

స్వదేశంలోనూ సంస్థల ప్రక్షాళన
ఇప్పటికే విదేశాలపై టారిఫ్‌లు, ఆంక్షలతో విరుచుకుపడుతున్న ట్రంప్ స్వదేశంలోనూ కొన్ని సంస్థల్లో సమూల ప్రక్షాళన చేపట్టేందుకు సన్నద్ధమయ్యారు. ప్రపంచంలో అతిపెద్ద సహాయ సంస్థ అయిన 'అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ' (USAID)లో ఏకంగా 9,700లకు పైగా ఉద్యోగాలు తొలగించేందుకు ట్రంప్‌ యంత్రాంగం ప్రణాళికలు వేస్తోంది.

అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 10వేల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ సంఖ్యను 300 దిగువకు తీసుకురావాలని యోచిస్తున్నారు. కేవలం 294 మంది మాత్రమే ఏజెన్సీలో పనిచేసేలా ట్రంప్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. వీరిలో 12 మంది ఆఫ్రికా బ్యూరో, ఎనిమిది మంది ఆసియా బ్యూరోలో ఉండనున్నారని తెలుస్తోంది. మిగతా 9700 మందికి త్వరలోనే ఉద్వాసన పలకనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, దీనిపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఇటీవలే విమర్శలు- ఆపై చర్యలు
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థను తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొట్టేస్తానని ట్రంప్‌ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అటు డోజ్‌ విభాగ సారథి, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ కూడా యూఎస్‌ఎయిడ్‌ నేరగాళ్ల సంస్థ అని విమర్శించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఈ సంస్థలో వందలాది మంది ఉద్యోగులను సెలవుపై పంపించేశారు. దాదాపు 120 దేశాలకు మానవతా దృక్పథంతో సహాయం చేయడానికీ, ఆ దేశాల అభివృద్ధికీ, భద్రతకూ నిధులు సమకూర్చడానికీ యూఎస్‌ఎయిడ్‌ను స్థాపించారు. ఈ సంస్థ వందల కోట్ల డాలర్లను సాయం చేస్తోంది.

ట్రంప్ ప్లాన్​ సక్సెస్​! - పాలస్తీనియన్లను గాజా నుంచి తరలింపు - ఈజిప్ట్ హెచ్చరికలు!

అమెరికాలో ఒకేసారి 40వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.