విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి.. సహాయక చర్యల్లో సీఎం - maharashtra landslide exgratia

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2023, 9:34 AM IST

Updated : Jul 20, 2023, 7:13 PM IST

Maharashtra Landslide Incident : మహారాష్ట్ర.. రాయ్​గఢ్​ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 16 మంది మృతిచెందారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో.. దాదాపు 21 మంది గాయపడ్డారు. శిథిలాల కింద సుమారు దాదాపు 17 కుటుంబాలకు చెందిన 100 మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన ఖలాపుర్​ మండలంలోని ఇర్షాల్‌వాడి అనే గ్రామంలో జరిగింది.  

Raigad Landslide : కొండచరియలు విరిగిపడ్డ ఘటనపై సమాచారం అందుకున్న రెస్యూ బృందాలు.. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని నవీ ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ట్రెక్కర్ల బృందాలను జిల్లా యంత్రాంగం కోరింది. హుటాహుటిన ఘటనాస్థలాన్ని ముఖ్యమంత్రి ఏక్​నాథ్​ శిందే చేరుకుని సందర్శించారు. 

మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియా ప్రకటన
ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియాను ముఖ్యమంత్రి శిందే ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందజేస్తామని, సహాయక చర్యల కోసం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించామని తెలిపారు.

శిందేకు అమిత్​ షా ఫోన్​.. 
ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ శిందేతో ఫోన్​లో మాట్లాడానని.. 4 ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్​ షా ట్వీట్ చేశారు. ప్రజలను రక్షించడం, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించడమే తమ పని అని ఆయన తెలిపారు.  

ఫైర్​ అధికారి మృతి..
రాయ్‌గఢ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా నవీ ముంబయి పౌర సంస్థకు చెందిన అగ్నిమాపక అధికారి శివరామ్​ గుండెపోటుతో మృతి చెందారు.

Last Updated : Jul 20, 2023, 7:13 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.