Long White Python In Karnataka: శ్వేతవర్ణంలో 9 అడుగుల కొండచిలువ... అరుదైన సర్పాన్ని చూశారా? - ఇండియాలో తెల్లని పాములు
🎬 Watch Now: Feature Video
Published : Aug 31, 2023, 12:18 PM IST
Long White Python In Karnataka : కర్ణాటకలో 9 అడుగుల పొడవైన తెల్లని కొండచిలువ కనువిందు చేసింది. ఉత్తర కన్నడ జిల్లలోని కుంమ్టా తాలుకా హేగ్దే గ్రామంలో ఈ సర్పం కనిపించింది. కొండచిలువను గ్రామంలోని దేవి నారాయణ్ ముక్రీ.. తన ఇంటి పరిసరాల్లో మంగళవారం అర్ధరాత్రి గమనించారు. వెంటనే ఆయన పాములను పట్టే పవన్ నాయక్‌కు సమాచారం అందించారు. సాధారణంగా కొండచిలువలో పిగ్మెంట్ లోపించడం వల్ల తెల్లగా మారతాయని పవన్ నాయక్ తెలిపారు. ఈ గ్రామంలో ఇటువంటి కొండచిలువ కనిపించడం రెండోసారని పవన్ నాయక్ తెలిపారు. గత సంవత్సరంలో కనిపించిన కొండచిలువ కంటే ఇది మూడు రెట్లు పెద్దగా ఉందని నాయక్ చెప్పారు. ఇలాంటి కొండచిలువలు పుట్టిన తరవాత ఎక్కువకాలం బతకడం కష్టమని, ఇతర జంతువుల చేతిలో చనిపోతాయని ఆయన చెప్పారు. కొండచిలువ తొమ్మిది అడుగుల పొడవు ఉందని తెలిపారు. దీనికి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసు ఉంటుందని నాయక్ అన్నారు. అనంతరం పవన్ నాయక్ కొండచిలువను కుమట అటవీ అధికారులకు అప్పగించారు. అధికారులు కొండచిలువను మైసూరు జంతుప్రదర్శన శాలకు తరలించారు.