Lokesh Protests in the Wake of Chandrababu Arrest: నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా: లోకేశ్ ఆగ్రహం - Yuvagalam Padayatra

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 11:16 AM IST

Lokesh Protests in the Wake of Chandrababu Arrest: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబు వద్దకు వెళ్లకూడదు అంటూ లోకేశ్​ను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి నోటీసులు లేకుండా పోలీసుల హై డ్రామా సృష్టించారు. నోటీసులు అడిగితే DSP వస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. లోకేశ్ వద్దకు మీడియాని రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రిని చూడడానికి తాను వెళ్లకూడదా అని లోకేశ్ పోలీసులను నిలదీశారు. తన వెంట నాయకులు ఎవరు రావడం లేదని.. కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నా అడ్డుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్​కి నిరసనగా క్యాంప్ సైట్ వద్ద తన బస్సు ముందే లోకేశ్ బైఠాయించి నిరసన తెలిపారు. పిచ్చోడు లండన్​కి.. మంచోడు జైలుకి ఇది కదా రాజారెడ్డి రాజ్యాంగం అని దుయ్యబట్టారు. జగన్‌ తల కిందులుగా తపస్సు చేసినా చంద్రుడిపై అవినీతి మచ్చ వెయ్యడం సాధ్యం కాదు సైకో జగన్ అని ఎద్దేవా చేసారు. లోకేశ్‌ను ఎందుకు ఆపారని నిలదీసిన లాయర్ కిషోర్​ను.. పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.