నిమ్మకాయలు ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే - నిమ్మకాయలు ఎలా ఎక్కువ కాలం నిల్వ చేయాలి
🎬 Watch Now: Feature Video
నిమ్మకాయలు నిల్వ చేసేందుకు కొన్ని ప్రత్యేక చిట్కాలు చెబుతున్నారు నిపుణులు. కొద్ది మొత్తంలో నిమ్మరసం అవసరమైనప్పుడు దాన్ని రెండు ముక్కలుగా కాకుండా చిన్న రంధ్రం చేసుకుంటే సరిపోతుంది. అలా రంధ్రం చేసిన దానికి నూనె అద్దించి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అందులోని తేమ బయటకు పోకుండా ఫ్రెష్‌గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. గాలి లోపలకు చొరబడని ఓ సీసాలో నీటిని నింపి అందులో నిమ్మకాయలు వేస్తే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అలా కాకుండా మార్కెట్లో దొరికే అల్యూమినియం ఫాయిల్‌తో నిమ్మకాయలను చుట్టి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే అవి ఎక్కువ రోజులు గట్టి పడకుండా తాజాగా ఉంటాయి. ఎండిపోయిన వాటిని కూడా వేడి నీటిలో వేసి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు మరిగించడం ద్వారా వాటిలోని కమ్మని రసాన్ని తిరిగి పొందవచ్చు.