Uppal Skywalk in Hyderabad : ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం.. ప్రత్యేకతలివీ.. - ఉప్పల్ స్కై వాక్
🎬 Watch Now: Feature Video
KTR inaugurates Uppal Skywalk Tower : హైదరాబాద్‌లో రోజురోజుకు వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతుండటంతో రోడ్డు దాటేందుకు పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో వాహనాలు దూసుకురావడంతో పాదచారులు మృత్యువాతపడ్డారు. ఆ విషయాన్ని గమనించిన ప్రభుత్వం నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్కైవాక్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఉప్పల్ చౌరస్తాలో కాలినడకన రోడ్డు దాటేవారికోసం ప్రత్యేకమైన స్కై వాక్ ఏర్పాటు చేసింది. ఇవాళ ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఉప్పల్ స్కై వాక్ టవర్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం స్కై వాక్‌పై నడిచారు.
ఉప్పల్ స్కై వాక్ ప్రత్యేకతలు..
- 660 మీటర్ల మేర ఉప్పల్ స్కైవాక్ నిర్మాణం
- స్కైవాక్ నిర్మాణానికి రూ.25 కోట్లు ఖర్చు పెట్టిన హెచ్‌ఎండీఏ
- ఉప్పల్, సికింద్రాబాద్ రహదారులు, మెట్రోస్టేషన్‌తో స్కైవాక్ అనుసంధానం
- ఎల్బీనగర్, రామంతాపూర్ రహదారులు, మెట్రోస్టేషన్‌తో స్కైవాక్ అనుసంధానం
- ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ నిర్మాణం
- వృద్ధులు, మహిళలు, గర్భిణులు స్కైవాక్ చేరుకునేందుకు ఎస్కలేటర్లు, లిఫ్టుల సౌకర్యం
- స్కైవాక్ మొత్తం పొడవు 640 మీటర్లు, వెడల్పు 4 మీటర్లు
- 6 మెట్ల మార్గాలు, 8 లిఫ్టులు, 12 ఎస్కలేటర్లు, 4 ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు