Kolkata Durga Puja Special Tramway : కోల్‌కతా ట్రామ్‌కు 150 ఏళ్లు.. దుర్గా పూజ థీమ్‌తో స్పెషల్ డిజైన్ - కోల్‌కతా దుర్గా పూజ 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 10, 2023, 10:14 AM IST
Kolkata Durga Puja Special Tramway : బంగాల్లో దుర్గాపూజతో పాటు కోల్‌కతా ట్రామ్వేస్ సేవలు ప్రారంభమై 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రత్యేక ట్రామ్‌ను రూపొందిచారు అధికారులు. ట్రామ్ లోపలే కాకుండా బయట కూడా అందమైన చిత్రాలతో అలకరించారు. ఈ ట్రామ్ టోలీగంజ్- బాలీగంజ్ మధ్య నూతన సంవత్సరం వరకు రాకపోకలు సాగించనుంది. నగరంలోని చారిత్రక ప్రదేశాలతో పాటు పూజ మందిరాలనూ కలుపుతూ ఈ ట్రామ్ నడవనుంది. దీనిని ఏషియన్ పెయంట్స్, XXL కలెక్టివ్‌తో కలిసి బంగాల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంయుక్తంగా చేపట్టింది.
మొదటి బోగిలో అందమైన దుర్గా విగ్రహాలను చెక్కారు. దీంతో పాటు దుర్గా పూజ విశేషాల వివరాలను ఇందులో పొందుపర్చారు. సింధూర్, ధునుచి నృత్య కళాకారుల బొమ్మలను గీశారు. ప్రయాణికులు వీటిని సులభంగా తెలుసుకునేలా క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. రెండో బోగిని కోల్‌కతాలోని చారిత్రక కట్టడాలు, సంస్కృతిని తెలిపేలా రూపొందించారు. 1873లో కోల్‌కతాలో ట్రామ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. కోల్‌కతా దుర్గాపూజకు ఇటీవల యూనెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది.