మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం భవిష్యత్ ఫలితాలకు దిక్సూచి: జనసేన అధినేత పవన్ - ఏపీ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
Published : Dec 3, 2023, 7:54 PM IST
Janasena Chief Pawan Comments on BJP Victory in Elections: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో బీజేపీ విజయం భవిష్యత్ ఫలితాలకు దిక్సూచి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజస్థాన్‌లో వెల్లువలా సాధించిన విజయం, మధ్యప్రదేశ్‌లో తిరిగి అధికారం చేజిక్కించుకోవడం, చత్తీస్‌గఢ్‌లో పూర్వ వైభవానికి బీజేపీ అగ్రనేతల దూరదృష్టి, పటిష్టమైన వ్యూహంతో పాటు అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశానికి అందిస్తున్న విశేష సేవలు ఈ విజయానికి దోహదపడ్డాయని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
Pawan on Telangana Election Results: తెలంగాణలో ప్రజాతీర్పుని స్వాగతిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. బీజేపీ-జనసేన కూటమిని ఆదరించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పోటీ జనసేనకు మైలు రాయిగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో యువత త్యాగాలు సమున్నతమైనవిగా భావించానని అందుకే ఈ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమంలో పోరాడిన కొందరు యువకులకు అవకాశం కల్పించి పోటీకి నిలబెట్టానని పవన్ వివరించారు. తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవశం చేసుకున్న కాంగ్రెస్ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందజేస్తామన్నారు.