Degree student suicide In Hyderabad : హైదరాబాద్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఓ డిగ్రీ విద్యార్థిని యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే న్యూ భవానీ నగర్‌కు చెందిన పూర్ణిమ అనే యువతి మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి రాగానే యాసిడ్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆమెను స్థానిక ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధించేవాడని, అతని వేధింపులు తట్టుకోలేకే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు.
యువతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన జవహర్‌నగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మృతదేహాన్ని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన ఫ్యామిలీ మెంబర్లు ఆందోళనకు దిగారు. తమ కుమార్తె మరణానికి కారణమైనటువంటి యువకుడిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను నిలదీశారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు సర్దిచెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
మీ టార్చర్ వల్లే మా పాప సూసైడ్ చేసుకుంది - బాచుపల్లి కాలేజీపై తల్లిదండ్రుల ఆగ్రహం