ETV Bharat / sports

2024 రౌండప్ : ఈ ఏడాది క్రికెట్​కు గుడ్​బై చెప్పిన ఫారిన్ ప్లేయర్లు - FOREIGN CRICKETERS RETIRED IN 2024

వార్నర్, క్లాసెన్​తోపాటు ఈ ఏడాది రిటైరైన ఫారిన్ ప్లేయర్స్ ఎవరంటే?

Foreign Cricketers Retired In 2024
Foreign Cricketers Retired In 2024 (Getty Images, Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 25, 2024, 10:07 PM IST

Foreign Cricketers Retired In 2024 : ఈ ఏడాది చాలా మంది క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పారు. చాలా మంది స్టార్ ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లకి రిటైర్మెంట్‌ ప్రకటించారు. ఈ క్రమంలో 2024లో క్రికెట్​కు గుడ్ బై చెప్పిన ఫారిన్ స్టార్స్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) : ఈ ఏడాది తొలుత రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్​ డేవిడ్ వార్నర్. సిడ్నీలో పాకిస్థాన్​తో చివరి టెస్టు ఆడిన తర్వాత కెరీర్‌కు ముగింపు పలికాడు. అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌. వార్నర్ వన్డేల్లో 6,932, టీ20ల్లో 3,277, టెస్టుల్లో 8,786 సహా 18,995 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 48 సెంచరీలు బాదాడు. అన్ని ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.
  • డీన్ ఎల్గర్ (సౌతాఫ్రికా) : సౌతాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ ఈ ఏడాది జనవరిలో భారత్​తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. తన కెరీర్ లో 86 టెస్టులు ఆడిన ఎల్గర్ 5347 పరుగులు చేశాడు. అందులో 15 శతకాలు, 23 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఎల్గర్ 18 టెస్ట్ మ్యాచ్‌ల్లో సఫారీ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించాడు.
  • హెన్రిచ్ క్లాసెన్ (సౌతాఫ్రికా) : హెన్రిచ్ క్లాసెన్ 2024 జనవరిలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. వికెట్ కీపర్- బ్యాటర్ కెరీర్‌లో కేవలం నాలుగు టెస్టులు ఆడాడు. 104 పరుగులు చేశాడు. వన్డేలు, టీ20ల్లో కొనసాగుతున్నాడు.
  • నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్) : న్యూజిలాండ్ తరపున 64 టెస్టులు ఆడిన తర్వాత నీల్ వాగ్నర్ 2024 ఫిబ్రవరిలో రిటైరయ్యాడు. తన కెరీర్ లో 260 టెస్టు వికెట్లు తీశాడు.
  • కొలిన్ మున్రో (న్యూజిలాండ్) : న్యూజిలాండ్ ఓపెనర్ కొలిన్ మున్రో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 57 వన్డేల్లో 1271 రన్స్ చేశాడు. అలాగే 65 టీ20ల్లో 1724 పరుగులు బాదాడు.
  • జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లాండ్) : 2009లో టీ20లకు, 2015లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన అండర్సన్ 2024 జులై 12న టెస్టులకు గుడ్ బై చెప్పాడు. దీంతో అన్ని ఫార్మాట్ల నుంచి అండర్సన్ వైదొలిగాడు. అతడు 188 టెస్టుల్లో 704 టెస్ట్ వికెట్లు తీశాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్​లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్, ఇంగ్లాండ్‌ బౌలర్‌ గా నిలిచాడు. అలాగే టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌ అయ్యాడు. అండర్సన్ కంటే షేన్ వార్న్ (708), ముత్తయ్య మురళీధరన్ (800) ఎక్కువ వికెట్లు తీసిన జాబితాలో ముందున్నారు.
  • డేవిడ్ మలన్ (ఇంగ్లాండ్) : ఇంగ్లాండ్ బ్యాటర్ ఈ ఏడాది ఆగస్టు 28న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు అంతర్జాతీయ ఫార్మాట్లలో సెంచరీలు సాధించిన ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లలో మలన్ ఒకరు. మలన్ టెస్టుల్లో 1074, వన్డేల్లో 1450, టీ20ల్లో 1892 రన్స్ బాదాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 8 శతకాలు బాదాడు.
  • షానన్ గాబ్రియెల్ (వెస్టిండీస్) : వెస్టిండీస్ పేసర్ షానన్ గాబ్రియెల్ ఈ ఏడాది ఆగస్టు 28న అంతర్జాతీయ క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల గాబ్రియెల్ 59 టెస్టులు, 25 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 202 వికెట్లు పడగొట్టాడు.
  • మొయిన్ అలీ (ఇంగ్లాండ్) : ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ కూడా 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల మొయిన్ 2014లో ఇంగ్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. తన కెరీర్​లో 68 టెస్టులు, 138 వన్డేలు, 92 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్​గా 6678 పరుగులు చేశాడు. 366 వికెట్లు తీశాడు.
  • షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ 2024లో టెస్టు, టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. వన్డేల్లో కొనసాగుతున్నాడు. టీ20 ఫార్మాట్​లో 129 మ్యాచుల్లో 2551 పరుగులు చేశాడు. అలానే 149 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 4000 పరుగులు, 240 వికెట్లు తీశాడు.
  • మహ్మదుల్లా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ మహ్మదుల్లా ఈ ఏడాది టీ20లకు గుడ్ బై చెప్పాడు. మహ్మదుల్లా 141 టీ20ల్లో 2443 రన్స్, 41 వికెట్లు తీశాడు. ఇప్పటికే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మదుల్లా వన్డేల్లో కొనసాగుతున్నాడు.
  • మాథ్యూ వేడ్ (ఆస్ట్రేలియా) : ఆసీస్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ అక్టోబరు 29న అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్ లో 36 టెస్టుల్లో 1613 , 97 వన్డేల్లో 1867, 92 టీ20ల్లో 1202 పరుగులు చేశాడు.
  • డేవిడ్ వీస్ (సౌతాఫ్రికా) : ఆల్ రౌండర్ డేవిడ్ వీస్ సౌతాఫ్రికా, నమీబియా రెండు దేశాల తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అతను 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు.
  • మహ్మద్ అమీర్ (పాకిస్థాన్) : 2024లో పాక్ పేసర్ మహ్మద్ అమీర్ అంతర్జాతీయ కెరీర్​కు గుడ్ బై చెప్పాడు. 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20లు ఆడిన అమీర్ 271వికెట్లు తీశాడు.
  • ఇమాద్ వసీం (పాకిస్థాన్) : ఇమాద్ వసీం ఈ ఏడాది డిసెంబరులో క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. తన కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి 1540 రన్స్, 117 వికెట్లు తీశాడు.
  • మహ్మద్ ఇర్ఫాన్ (పాకిస్థాన్) : పాకిస్థాన్‌ కు చెందిన లెఫ్టార్మ్ పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ ఈ ఏడాది క్రికెట్​కు గుడ్ బై చెప్పాడు. తన కెరీర్​లో అన్ని ఫార్మాట్లలో కలిపి 109 వికెట్లు తీశాడు.
  • టిమ్ సౌథీ (న్యూజిలాండ్) : 2024 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత టిమ్ సౌథీ రిటైరయ్యాడు. సౌథీ టెస్టుల్లో 391 సహా అన్ని ఫార్మాట్‌లలో కలిపి 770 వికెట్లు పడగొట్టాడు, రిచర్డ్ హ్యాడ్లీ తర్వాత న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

టీ20 వరల్డ్‌ కప్‌ టు టెస్ట్‌ క్లీన్‌ స్వీప్‌! - 2024లో భారత క్రికెట్‌లో జరిగిన కీలక అంశాలు ఇవే!

రోహిత్ విరాట్ కాకుండా ఈ ఏడాది క్రికెట్​కు వీడ్కోలు పలికిన ప్లేయర్లు ఎవరంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.