Rape Attempt On Bihar Minor Girl : చీకట్లో ఇద్దరు స్నేహితులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా కొందరు దుండగులు ఆటోను అడ్డుకుని అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. అది చూసిన స్నేహితుడు, ఆటోడ్రైవర్ ఆమెను కాపాడేందుకు విశ్వప్రయత్నాలు చేశారు. చివరికి వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లారు. అప్పటికీ వదలని దుండగులు అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు వేడుకున్నా వదలకుండా అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడబోతుంటే పోలీసులు వచ్చి కాపాడారు. సినిమా తరహాలో ఉన్న ఘటన తాజాగా బోరబండలో చోటుచేసుకుంది.
బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : బిహార్‌కు చెందిన అమ్మాయి(17) బోరబండలో తన బంధువుల ఇంట్లో ఉంటూ మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో వంట మనిషిగా పని చేస్తోంది. సోమవారం సాయంత్రం జీతం కోసం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో అదే హోటల్‌లో కుక్‌గా పని చేసే యువకుడి (18)తో కలిసి రాత్రి 10.40సమయంలో బోరబండ వెళ్లే ఆటో ఎక్కింది. బోరబండకు సమీపంలో ఉండే సంత ప్రాంతం వద్ద నలుగురు యువకులు ఆటోను అడ్డగించారు. వారిలో ఇద్దరు ఆటో ఎక్కారు.
మైనర్ బాలికపై అత్యాచారం - సవతి తండ్రికి 141 ఏళ్ల జైలు శిక్ష
ఆటోలో నుంచి తోసేసి పోనించినా వదల్లేదు : ఒకరు అమ్మాయి పక్కన, మరో యువకుడు డ్రైవర్ పక్కన కూర్చున్నారు. అయితే అమ్మాయి పక్కన కూర్చున్న వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మిగతావారు ఆటోను ఆనుసరిస్తూ బైకులపై వచ్చారు. అయితే అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకుడిని ఆమె స్నేహితుడు, ఆటో డ్రైవర్ ప్రశ్నించగా మిగతా యువకులు వారిపై దాడి చేశారు. అప్పటికీ ఆటో డ్రైవర్ ధైర్యం చేసి వారిని ఆటోలో నుంచి తోసేసి అమ్మాయిని వాళ్ల ఇంట్లో దింపడానికి పోనించాడు. అయినా వదలని దుండగులు ఆటోను వెంబడించి అందులోకి ఎక్కారు. ఆటో డ్రైవర్ వారిని బెదిరిస్తూనే అమ్మాయిని ఇంటి దగ్గర దింపేశాడు.
కాళ్లు పట్టుకుని వేడుకున్న కనికరించలేదు : ఆమె ఇంట్లోకి వెళ్లగా ఆగని నిందితులు ఇంట్లోకి జొరబడి అమ్మాయిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అమ్మాయి బంధువులు ఆ యువకుల కాళ్లు పట్టుకుని వేడుకున్నా కనికరించలేదు. దీంతో కాపాడాలంటూ అమ్మాయి చేస్తున్న ఆర్తనాదాలు విని పొరుగింట్లో ఉండే వ్యక్తి డయల్ 100కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులైన మొహసిన్, అక్బర్, అంబాదాస్, ఫరీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలుడిపై అత్యాచారం - నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఒంటరి మహిళలే ఆ 'సీరియల్ కిల్లర్' టార్గెట్ - కనిపిస్తే దోపిడీ, హత్య - చివరకు?