తమిళనాడులో జల్లికట్టు సందడి షురూ- శ్రీలంకలోనూ ఘనంగా పోటీలు! - jallikattu tamil nadu
🎬 Watch Now: Feature Video
Published : Jan 6, 2024, 1:18 PM IST
Jallikattu Festival 2024 : తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టు సందడి మొదలైంది. ఈ ఏడాది మొదటి జల్లికట్టు పోటీలు పుదుకొట్టై జిల్లా థంచన్‌కురిచ్చి గ్రామంలో ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో 500 ఎద్దులు పాల్గొంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమిళనాడులో పొంగల్ వేడుకల్లో భాగంగా నిర్వహించే జల్లికట్టు పోటీలు పురాతనకాలం నుంచి కొనసాగుతున్నాయి. మధురై సహా ఇతర ప్రాంతాల్లో కూడా జల్లికట్టు పోటీల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 15న ప్రారంభమై 3 రోజులపాటు పోటీలు కొనసాగనున్నాయి. ఈనెల 15న మధురై జిల్లా అవనియపురం, 16న పలమేడు, 17న అలంగనల్లూరులో జల్లికట్టు పోటీలు నిర్వహించనున్నారు.
Jallikattu in Sri Lanka : మరోవైపు శ్రీలంకలోనూ జల్లికట్టు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రింకోమాలీలో నిర్వహిస్తున్న ఈ పోటీలను తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తోండమన్, మలేసియా ఎంపీ ఎమ్ శరవణన్ ప్రారంభించారు. ఈ పోటీల్లో సుమారు 200 ఎద్దులు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 100 మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.