దేశవ్యాప్తంగా ఫైనల్ మేనియా- భారత్ గెలవాలని ఉజ్జయినిలో పూజలు- భారీ రంగోలితో ఆల్ ది బెస్ట్! - world cup final updates
🎬 Watch Now: Feature Video
Published : Nov 19, 2023, 10:28 AM IST
ind vs aus world cup final 2023 : మరికొన్ని గంటల్లో వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడా లోకం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ఫైనల్లో అడుగుపెట్టిన టీమ్ఇండియా.. ఈసారి ఛాంపియన్‌గా నిలవాలని కోట్లాది మంది భారతీయులు ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచే టీమ్ఇండియా ఫ్యాన్స్ వినూత్న రీతిలో భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. టీమ్ఇండియా గెలవాలని.. మధ్యప్రదేశ్ ఉజ్జయిని ఆలయంలో పూజారులు అభిషేకం, అర్చన నిర్వహించారు. మరోవైపు తమిళనాడు మధురైలోని వినాయక ఆలయంలో, టీమ్ఇండియా ఆటగాళ్ల పేరిట అర్చన చేయించారు స్థానిక అభిమానులు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆర్టిస్ట్.. 8 ఫీట్ల ఎత్తైన రోహిత్ స్కెచ్ వేసి, టీమ్ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఒడిశా పూరి బీచ్ వద్ద శాండ్ ఆర్టిస్ట్ ఒకరు.. ఇసుకతో భారత్, ఆస్ట్రేలియా చిహ్నాలను చిత్రించి మద్దతు తెలుపారు. యూపీ సీతాపుర్లోని సీతా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రంగోళీతో ప్రపంచకప్ చిత్రించి.. భారత్‌కు మద్దతుగా మానవ హారం నిర్వహించారు. ఇలా దేశనలుమూలల నుంచి టీమ్ఇండియాకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. కాగా, ఆదివారం మధ్యాహ్నం అహ్మదాబాద్ వేదికగా 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.