ETV Bharat / sports

ఇంగ్లాండ్​తో రెండో T20- చెపాక్​లోనూ చెక్ పెట్టేందుకు ప్లాన్ - IND VS ENG 2ND T20

భారత్ x ఇంగ్లాండ్ రెండో టీ20- జోరుమీదున్న టీమ్ఇండియా

Ind vs Eng 2nd T20
Ind vs Eng 2nd T20 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 24, 2025, 7:05 PM IST

Updated : Jan 24, 2025, 10:37 PM IST

Ind vs Eng 2nd T20 2025 : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌- ఇంగ్లాండ్‌ జట్లు శనివారం చెన్నై వేదికగా రెండో మ్యాచ్‌లో తలపడనున్నాయి. శనివారం రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ఆరంభంకానుంది. తొలి టీ20లో జయభేరి మోగించిన టీమ్​ఇండియా ఈ పోరులో కూడా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాలని కోరుకుంటోంది. తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై అన్ని విభాగాల్లోనూ భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో టీ20లోనూ అదే జోరు కొనసాగించాలని టీమ్ఇండియా భావిస్తోంది.

ఈసారైనా?
కోల్‌కోతాలో పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి సత్తా చాటి ఇంగ్లాండ్‌ను తక్కువ పరుగులకే పరిమితం చేశారు. అయితే సుదీర్ఘ విరామం తర్వాత టీ20లకు ఎంపికైన పేసర్‌ మహ్మద్‌ షమీ తొలిమ్యాచ్‌లో ఆడలేదు. దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టేందుకు సిద్ధమైన సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఈ మ్యాచ్‌లోనైనా తుదిజట్టులో చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.

చెపాక్ పిచ్ స్పిన్నర్లదే!
చెన్నై పిచ్ స్పిన్నర్లకు మరింత సహకరిస్తుందని భావిస్తున్నారు. వరుణ్‌, అక్షర్‌ పటేల్‌, రవిబిష్ణోయ్‌తో భారత స్పిన్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, లివింగ్‌ స్టోన్‌ భారత బ్యాటర్లను కట్టడి చేయాలని ఇంగ్లాండ్‌ జట్టు కోరుకుంటోంది.

దూకుడుమీదున్న ఓపెనర్లు
భారత ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌ కళ్లు చెదిరే ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడుతూ భారత్‌కు భారీ ఆరంభాలు ఇస్తున్నారు. చివరి ఆరు టీ20 ఇన్నింగ్స్‌ల్లో సంజూ శాంసన్‌ 3 సెంచరీలు నమోదు చేశాడు. కోల్‌కతా టీ20లో అభిషేక్‌ శర్మ 230 స్ట్రయిక్‌రేట్‌తో పరుగుల వరద పారించాడు. మరోసారి వీరిద్దరి నుంచి ఫ్లయింగ్‌ స్టార్ట్‌ను టీమిండియా ఆశిస్తోంది.

కమ్​బ్యాక్​ కోసం!
కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ పెద్దగా ఫామ్‌లో లేకపోవడం కలవరపెడుతోంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత ఆడిన 11 టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్‌ యాదవ్‌ రెండే అర్థశతకాలు నమోదు చేశాడు. గత మూడు టీ20ల్లో పెద్దగా పరుగులేమీ చేయలేదు. చెన్నై టీ20 కోసం తుదిజట్టులో భారత్‌ పెద్దగా మార్పులేమీ చేయకపోవచ్చని భావిస్తున్నారు. దాదాపు అదే జట్టుతో దిగాలని ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది.

హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్​ స్పెషల్ గెస్చర్​ - 'అలా చేయడానికి వాళ్లే కారణం - ఆ ఇద్దరి కోసమే అదంతా!'

'సింగ్ ఈజ్ కింగ్': చరిత్ర సృష్టించిన అర్షదీప్- టీ20ల్లో ఆల్​టైమ్ రికార్డ్​

Last Updated : Jan 24, 2025, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.