Hospital Staff Not Provide Ambulance : చచ్చినా.. చావేనా..! మృతదేహానికి అంబులెన్స్ ఇవ్వని ఆస్పత్రి సిబ్బంది - ముంచింగిపుట్టు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి
🎬 Watch Now: Feature Video
Published : Oct 23, 2023, 10:58 AM IST
Hospital Staff Not Provide Ambulance : పేదలు అంటే చులకన భావమో లేక.. గిరిజనుడంటే అలుసో.. చనిపోయినా సరే... వివక్షను ఎత్తిచూపే ఘటన ఇది.. పొలం పని చేస్తున్న గిరిజనుడు ఉన్నట్టుండి స్ఫృహ తప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు.. స్థానికుల సహకారంతో ఆటోలో ఆస్పత్రికి తరలించేలోపే అతడు కన్నుమూశాడు. మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ వాహనం ఇవ్వకుండా ఆస్పత్రి సిబ్బంది ఆ గిరిజనుడిని మరోసారి అవమానించి చంపేశారు.
మృతదేహానికి అంబులెన్స్ ఇవ్వకపోవడంతో ఆస్పత్రి నుంచి పాడె కట్టి తీసుకెళ్తూ నిరసన తెలిపిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్ మండలం కొండపడలో జరిగింది. కిముడు అద్దన్న అనే గిరిజనుడు పొలం పనులు చేసుకుంటూ ఆకస్మికంగా స్పృహ తప్పి పడిపోయాడు. ముంచింగిపుట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ప్రైవేట్ ఆటోలో తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ ఇవ్వవలసిందిగా సిబ్బందిని కోరినా ఇవ్వలేదు. ఎంపీటీసీ, జెడ్పీ చైర్ పర్సన్ వారికి ఫోన్ చేశారు. అయినా అంబులెన్స్ ఇవ్వకపోవడంతో మృతదేహానికి పాడె కట్టి ఆసుపత్రి నుంచి మోసుకెళ్తూ నిరసన తెలిపారు. మృతదేహం తీసుకెళ్లెందుకు అంబులెన్స్ ఇవ్వకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు.