అర్ధరాత్రి కారు బీభత్సం.. పోలీసులను ఢీకొట్టి పరార్! - జైపుర్ వార్తలు
🎬 Watch Now: Feature Video
రోడ్డుపై విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు పోలీసు సిబ్బందిని కారుతో ఢీకొట్టి పారిపోయిన సంఘటన రాజస్థాన్, జైపుర్ నగరంలో బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో జరిగింది. ఝోట్వాడా ఠాణా పరిధిలోని కాంటా చౌరస్తాలో బారికేడ్ల వద్ద ఇద్దరు పోలీసు అధికారులు నిల్చొని ఉండగా.. వేగంగా వచ్చిన కారు పోలీసులను ఢీకొట్టింది. దీంతో వారు ఎగిరి కొంత దూరంలో పడ్డారు. తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ను మిగతా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి కొంత దూరంలో కారును వదిలేసినట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్లు దర్యాప్తు అధికారి రామ్ నరేశ్ తెలిపారు. కారు నంబర్ ఆధారంగా డ్రైవర్ కోసం గాలింపు చేపట్టామన్నారు. మరోవైపు.. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వైరల్గా మారాయి.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST