కాలేజీ గ్రౌండ్లో హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్- స్టూడెంట్స్ అరుపులు, లైవ్ వీడియో చూశారా? - యూపీ లఖ్‌నవూలో హెలిక్యాప్టర్ ల్యాండింగ్
🎬 Watch Now: Feature Video
Published : Nov 23, 2023, 8:30 AM IST
Helicopter Emergency Landing In Lucknow : ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ పట్టణంలోని ఓ కళాశాల మైదానంలో ఒక్కసారిగా హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇలా విమానాన్ని మైదానంలో దింపడం వల్ల అక్కడే ఉన్న కాలేజీ విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఇదీ సంగతి..!
లామార్టినియర్ కాలేజీ.. పట్టణంలోని ప్రతిష్ఠాత్మకమైన మిషనరీ విద్యాసంస్థల్లో ఒకటి. అక్కడ బుధవారం 139వ జూనియర్ స్కూల్ స్పోర్ట్స్ డే ఈవెంట్‌ను నిర్వహించారు. ప్రోగ్రాంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో కళాశాలకు చెందిన పోలో మైదానంలో ఉన్నట్టుండి VT-UPL అనే పేరుగల హెలికాఫ్టర్ ల్యాండ్ అయింది. ఈ క్రమంలో అక్కడే ఉన్నవారు భయాందోళనకు గురై గట్టిగా అరిచారు. అయితే ల్యాండింగ్ అయ్యే సమయంలో వచ్చే గాలి ధాటికి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్లు, జెండాలు, టెంట్లు, స్తంభాలు నేలకూలాయి. అంతేకాకుండా విమానం కిందకు దిగే క్రమంలో చెలరేగే దుమ్ము కారణంగా విద్యార్థులు, సిబ్బంది, ప్రేక్షకులు ఇబ్బంది పడ్డారు. ఇక హెలికాప్టర్ అకస్మాత్తు ల్యాండింగ్‌కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు ఈ వ్యవహారంపై కళాశాల ప్రిన్సిపల్ సి.మెక్‌ఫార్లాండ్.. పౌర విమానయాన శాఖతో పాటు డైరెక్టరేట్ ఆఫ్ ఎయిర్ సేఫ్టీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇలా ముందస్తు సమాచారం లేకుండా విమానాన్ని ఎలా ల్యాండింగ్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.