Hair Transplant Safe Or Not : బట్టతలపై హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించడం సురక్షితమేనా? - hair transplant side effects
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2023, 9:24 AM IST
Hair Transplant Safe Or Not : హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్.. బట్టతల సమస్యతో బాధపడేవారు ఈ చికిత్సనే చివరి ఆయుధంగా భావిస్తారు. అయితే ఈ ఆలోచన ముమ్మాటికీ తప్పని అంటున్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ చంద్రావతి. జుట్టు ఊడిపోవడానికి అనేక రకాల కారణాలుంటాయని ఆమె చెబుతున్నారు. హెయిర్ లాస్ అనేది ఇన్ఫెక్షన్స్, బాల్డింగ్ సహా ఇతర జబ్బుల కారణంగా కూడా జరిగే అవకాశం ఉంది. అయితే వీటన్నింటికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక్కటే పరిష్కారం అని అనుకోవడం పెద్ద అపోహ మాత్రమే అని ఆమె స్పష్టం చేశారు. ముందుగా జుట్టు ఊడిపోవడానికి గల కారణాలను తెలుసుకోకుండా హెయిర్ ట్రాన్‌ప్లాంటేషన్ ట్రీట్మెంట్కు వెళ్లడం ప్రమాదకరమని ఆమె హెచ్చరించారు. కేవలం మందులతో కూడా.. రాలిపోయిన జుట్టును తిరిగి తెప్పించవచ్చని చెప్పారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానం అనేది చివరి స్టేజ్‌లో మాత్రమే సజెస్ట్ చేస్తామని డా.చంద్రావతి అన్నారు. హెయిర్ లాస్‌తో బాధపడేవారు ముందుగా డెర్మటాలజిస్ట్‌ను మాత్రమే సంప్రదించాలని ఆమె సూచిస్తున్నారు. మరి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చికిత్సా విధానం అనేది అందరికీ సురక్షితమేనా? ఏ సమయంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లాలి? అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం.