Habsiguda Fire Accident today : హబ్సిగూడలో అగ్నిప్రమాదం.. దట్టమైన పొగతో భారీగా ట్రాఫిక్ జామ్ - హైదరాబాద్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Habsiguda Fire Accident in Hyderabad Today : భాగ్యనగరంలో అగ్నిప్రమాదాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారానికి లేదా కనీసం నెలకొకటైనా అగ్నిప్రమాదాలు సంభవించడం వల్ల నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా వేసవిలో అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం వానా కాలంలోనూ ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తరచూ ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నగరంలోని హబ్సిగూడలో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి అవి ఇతర అంతస్తులకు వ్యాపించాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. 10 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేశారు. మంటలు అదుపులోకి వచ్చినా.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. పక్కనే పెట్రోల్ బంకు ఉండటంతో ముందు జాగ్రత్తగా ఆ బంకును పోలీసులు మూసివేయించారు. ఈ ప్రమాదం కారణంగా ఉప్పల్ నుంచి హబ్సిగూడ మార్గమంతా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.