Liquor Thief Remanded in Medak : మద్యం దుకాణంలోకి దొంగతనానికి వెళ్లి అందులోనే నిద్రపోయిన దొంగను బుధవారం రిమాండ్‌కు తరలించారు. నార్సింగి ఎస్సై అహ్మద్ మొహినుద్దీన్ తెలిపిన ప్రకారం నేపాల్‌కు చెందిన రాజాసోద్ నార్సింగిలోని రైస్‌మిల్లులో కూలీగా పని చేసేందుకు తొమ్మిది నెలల కిందట వచ్చాడు. అందులో పని చేస్తూ, వచ్చిన జీతంతో రోజూ మద్యం సేవించేవాడు.
మద్యం దొంగ రిమాండ్ : ఇటీవల మద్యం దుకాణ పరిసరాలను పరిశీలించి కనకదుర్గ వైన్స్‌లో చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం ఆదివారం రాత్రి దుకాణం పైన ఉన్న రేకులను తొలగించి అందులోకి దూరాడు. అక్కడ మద్యం కనిపించడంతో తాగిన తర్వాతే దొంగతనం చేద్దామనుకున్నాడేమో కానీ విపరీతంగా మద్యం తాగి మత్తులో రాత్రంతా వైన్స్ షాపులోనే నిద్రపోయాడు.
మద్యం దుకాణంలోకి దొంగతనం : గత నెల 29 రాత్రి 10 గంటలకు వైన్స్ షాప్ మూసివేసిన నిర్వాహకులు, తిరిగి ఈ నెల 30న ఉదయం తెరవగా మద్యం మత్తులో ఉన్న దొంగ ఉన్నాడు. ఒక్కసారిగా అవాక్కయిన వైన్ షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దొంగను అదుపులోకి తీసుకున్నాడు. మత్తులో ఉన్న అతడిని మొదటగా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం బుధవారం సాధారణ స్థితికి వచ్చాక పోలీసులు కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తెలియని వారిని ఇంట్లో పనికి పెట్టుకుంటున్నారా? - అయితే వారిపై ఓ కన్నేయండి