Guru Purnima Shirdi 2023 : గురు పూర్ణిమకు ముస్తాబైన శిర్డీ.. మూడు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు - శిర్డీ గురు పూర్ణిమ ఉత్సవాలు 2023
🎬 Watch Now: Feature Video
Guru Purnima Shirdi 2023 : శిర్డీలో గురు పూర్ణిమ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు భక్తి శ్రద్ధలతో సాయినాథుడికి పూజలు జరగనున్నాయి. గురు పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని.. సంస్థాన్ నిర్వాహకులు శిర్డీని ఆకర్షణీయమైన విద్యుత్ దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు. బాబా దర్శనార్థం శిర్డీకి విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంస్థాన్ అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున సాయిబాబాకు ఆలయ అర్చకులు కాకడ హారతి నిర్వహించారు. అనంతరం మందిరం నుంచి సాయి ఫొటో, వీణ, చరిత్ర వచనాలను ఊరేగింపుగా ద్వారకామాయికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో సిద్ధారామ్ సాలిమత్, జిల్లా మేజిస్ట్రేట్, సాయి కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొని.. సాయి నామం పఠించారు. అత్యంత భక్తితో భక్తులు చేస్తున్న సాయి కథ అఖండ పారాయణం సోమవారం వరకు జరగనుంది. గురు పూర్ణిమ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని, గర్భగుడిని సంస్థాన్ నిర్వాహకులు పూలతో సుందరంగా అలంకరించారు. కాగా గురు పూర్ణిమ రోజు శిర్డీకి వేల సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుందని వారు తెలిపారు.