రైలు పట్టాలు తప్పి 20 బోగీలు చెల్లాచెదురు - goods train detrail in maharashtra
🎬 Watch Now: Feature Video
మహారాష్ట్ర అమరావతిలోని మల్ఖేడ్ రైల్వే గ్రామం సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బల్హర్షా నుంచి భుసావల్ వెళ్తున్న సరకు రవాణా రైలు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఘటన సమయంలో భారీ శబ్దం రావడం వల్ల రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ.. ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీపావళి పండుగ రోజున ఇలా మూడు, నాలుగు గంటలపాటు రైళ్లు ఆలస్యంగా ప్రయాణించడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST