ETV Bharat / health

దగ్గుతో నిద్ర కూడా పట్టట్లేదా? ఈ స్వీట్ మందు తీసుకుంటే తగ్గే ఛాన్స్! - COUGH REMEDIES AT HOME

-దగ్గు సమస్యకు ఆయుర్వేద ఔషధంతో పరిష్కారం -ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎంతో ఉపయోగం

Cough Remedies at Home
Cough Remedies at Home (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 28, 2024, 12:10 PM IST

Updated : Dec 28, 2024, 12:19 PM IST

Cough Remedies at Home: చలికాలంలో జలుబుతో పాటు దగ్గు సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. రోజు ట్యాబ్లెట్లు తీసుకున్నా సరే.. కొంత మందిలో అంత సులభంగా నయం కాదు. ఇలా దగ్గు సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు.. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఈ ఔషధం ఎంతో సాయం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయుర్వేద ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 80 గ్రాముల వంశలోచనం చూర్ణం (వెదురు ఉప్పు)
  • 40 గ్రాముల పిప్పళ్ల చూర్ణం
  • 20 గ్రాముల యాలకుల చూర్ణం
  • 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణం
  • 150 గ్రాముల పటిక బెల్లం చూర్ణం

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెను తీసుకుని అందులో వెదురు ఉప్పు, పిప్పళ్లు, యాలకుల, దాల్చిన చెక్క, పటిక బెల్లం చూర్ణం తీసుకుని బాగా కలపాలి.
  • దీనికి గాలి తగలకుండా ఉండేలా గట్టిగా మూత పెట్టుకుని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.
  • దగ్గు వచ్చే పిల్లలకు 3 లేదా 4 పూటలు ఒక చిన్నా చెంచాడు చూర్ణాన్ని ఇవ్వాలని గాయత్రీ దేవి చెబుతున్నారు.
  • దీనిని నేరుగా మింగేయకుండా.. నాలుక మీద వేసుకుని చప్పరిస్తూ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ చిన్నపిల్లలు ఇలా చేయకపోతే కొంచెం తేనె వేసి కలిపి ఇవ్వాలని చెబుతున్నారు.

వెదురు ఉప్పు: దీనికి కఫ దోషాన్ని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇంకా కఫాన్ని తగ్గించడంతో పాటు గొంతులో వచ్చే ఇబ్బందులను తొలగిస్తుందని అంటున్నారు.

పిప్పళ్లు: కారంగా ఉండే ఈ పిప్పళ్లు కఫాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఇది శరీరానికి వేడి చేయకుండా మంచి టానిక్​లాగా పనిచేస్తుందని అంటున్నారు.

యాలకులు: దీనికి కఫ దోషాన్ని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుందని చెబుుతున్నారు. ఇంకా గొంతులోని ఎలర్జీలను తగ్గిస్తుందని అంటున్నారు. దీంతో పాటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందని వివరిస్తున్నారు.

దాల్చిన చెక్క: శరీరంలోని ఇన్​ఫెక్షన్లు తగ్గించడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కఫాన్ని తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుందని వివరిస్తున్నారు.

పటిక బెల్లం: ఇది తీయగా ఉన్నా.. గొంతులోని కఫాన్ని తగ్గించే గుణం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు తెల్లబడుతుందా? వెంట్రుకలు రాలిపోతున్నాయా? ఈ నేచురల్ హెయిర్ ప్యాక్​తో అంతా సెట్!

షుగర్, కిడ్నీ పేషెంట్స్ "గుండె" ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు!

Last Updated : Dec 28, 2024, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.