Gold Flowers Donation to TTD: తిరుమల శ్రీవారికి భక్తుడి భారీ కానుక.. కోట్ల విలువైన 108 బంగారు పుష్పాలు సమర్పణ - టీటీడీ లేటెస్ట్ న్యూస
🎬 Watch Now: Feature Video
Published : Sep 6, 2023, 5:13 PM IST
|Updated : Sep 6, 2023, 5:27 PM IST
Gold Flowers Donation to TTD: తిరుమల శ్రీవారికి భారీ కానుక విరాళంగా అందింది. 108 బంగారు పుష్పాలను స్వామివారికి కడపకు చెందిన డాక్టర్ రాజారెడ్డి అనే భక్తుడు కానుకగా అందించారు. శ్రీవారి అష్టాదళ పాదపద్మారాధన సేవలో వినియోగించేందుకు తమ సంస్థ వీటిని ప్రత్యేకంగా తయారు చేసినట్లు లలితా జ్యువెలరీ కంపెనీ అధినేత కిరణ్ కుమార్ తెలిపారు. వీటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. ఏడుకొండల వారిని దర్శించుకున్న అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు బంగారు పుష్పాలను అందజేశారు.
Gold Flowers Made by Lalitha Jewellery: స్వామివారికి విలువైన బంగారు పుష్పాలను విరాళంగా అందించిన వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందిచగా.. ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. కాగా.. కడపకు చెందిన డాక్టర్ రాజా రెడ్డి శ్రీవారికి కానుకగా ఇచ్చేందుకు.. వీటిని ప్రత్యేకంగా తమతో తయారు చేయించినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. బంగారంతో తయారు చేసిన ఈ అందమైన పుష్పాలను స్వామివారి అష్టాదళ పాదపద్మారాధన సేవలో వినియోగించనున్నారు.