Ganesh Museum With 800 Idols : ఆ ఇంట్లో 800 వినాయక విగ్రహాలు.. 10ఏళ్లుగా సేకరణ.. ఎక్కడంటే? - 800 వినాయక విగ్రహాలతో మ్యూజియం
🎬 Watch Now: Feature Video
Published : Sep 22, 2023, 8:33 PM IST
Ganesh Museum With 800 Idols : సాధారణంగా మన ఇంట్లో ఒకటో, రెండో వినాయక విగ్రహాలు ఉంటాయి. కానీ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం ఏకంగా 800 విగ్రహాలు సేకరించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. షాజాపుర్ జిల్లా లాల్పురా గ్రామనికి చెందిన రామకృష్ణ భవాసర్ కుటుంబం చాలా ఏళ్ల నుంచే వినాయక విగ్రహాలను సేకరిస్తోంది. విహారయాత్రకు ఎక్కడకు వెళ్లినా భవాసర్ తండ్రికి గణేశుని విగ్రహాలు తీసుకురావడం అలవాటు. గత పది సంవత్సరాలుగా ఆ కుటుంబం ఈ విధంగా విగ్రహాలు సేకరిస్తూనే ఉంది. తన తండ్రి బాటలోనే ఇప్పుడు ఆయన కుమారుడు పయనిస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఎనిమిది వందలకు పైగా సేకరించారు. తమ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించి విజయపథంలో ఆ బొజ్జగణపయ్య నడిపిస్తారని వారు నమ్ముతున్నారు. ఓ వైపు హోటల్ నిర్వహిస్తూనే మరోవైపు విగ్రహాల సేకరణ చేస్తోంది ఆ కుటుంబం.
"మా తండ్రి ఎక్కడికి వెళ్లినా గణేశుడి ప్రతిమలు తీసుకొచ్చేవారు. ఈ విగ్రహాల సేకరణ గత 10-15ఏళ్లుగా సాగుతోంది. దీనిని ఇలానే భావి తరాలకు కూడా కొనసాగించాలన్నది నా ఆశ. వినాయకుడి విగ్రహాలను మా తండ్రి ఏనాడూ నిమజ్జనం చేయలేదు. మేము వీటిని ఇలా మ్యూజియం తరహాలో భద్రపరిచాం. గణేశుడు మాకు ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతాడు, మార్గదర్శిగా నిలుస్తాడు, మాకు విజయాన్ని అందిస్తాడు."
-రామకృష్ణ భవాసర్