కార్చిచ్చు బీభత్సం.. కాలేజీ హాస్టల్లోకి వ్యాపించిన మంటలు
🎬 Watch Now: Feature Video
Uttarakhand Forest Fire: ఉత్తరాఖండ్‌లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. శ్రీనగర్‌లోని గఢ్వాలీ సమీపంలోని అడవుల్లో నాలుగు రోజులుగా మంటలు వ్యాపిస్తున్నాయి. మంగళవారం ఇక్కడి ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్దకు మంటలు వ్యాపించాయి. బాయ్స్ హాస్టల్ భవనం వద్ద అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక బృందాలు.. మంటలను ఆర్పివేశాయి. అటవీ అధికారులు సైతం సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే, బలంగా గాలులు వీస్తున్నందున రాత్రి సమయంలో మళ్లీ మంటలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు, మెడికల్ కాలేజీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST