ఇళ్ల మధ్యలో చిరుత హల్చల్.. స్థానికులు హడల్.. మత్తు మందు ఇచ్చి.. - ఇళ్లలో చిరుత హల్చల్
🎬 Watch Now: Feature Video
leopard in haridwar: ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో చిరుత హల్చల్ సృష్టించింది. నగరంలోని నివాస స్థలాల మధ్య తిరుగుతూ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. హర్కీ పైడి ప్రాంతంలోని ఓ హనుమాన్ మందిరం వద్ద చిరుత కనిపించిందని స్థానికులు తెలిపారు. ఇళ్ల మధ్య తిరుగుతున్న చిరుత దృశ్యాలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. చిరుతను పట్టుకునేందుకు అటవీ అధికారులు కొద్దిరోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు మంగళవారం వణ్యప్రాణిని బంధించారు. మత్తుమందు ఇచ్చే తుపాకీని ఉపయోగించి చిరుత స్పృహ కోల్పోయేలా చేశారు. అనంతరం బోనులో బంధించారు. రాజాజీ పార్క్‌లోని సంరక్షణ కేంద్రానికి చిరుతను తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST