Fire In Express Train : ఎక్స్​ప్రెస్​ రైలులో ఒక్కసారిగా మంటలు.. బెంగళూరు స్టేషన్​లోనే.. - ఉద్యాన్​ ఎక్స్​ప్రైస్​లో మంటలు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 19, 2023, 10:24 AM IST

Updated : Aug 19, 2023, 10:52 AM IST

Fire In Express Train Bangalore : కర్ణాటకలోని బెంగళూరులో ఉద్యాన్‌ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న సుమారు రెండు గంటల తర్వాత మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు అలుముకున్నాయి. ప్రయాణికులంతా అప్పటికే దిగి వెళ్లిపోవడం వల్ల ముప్పు తప్పింది. హుటాహుటిన ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. Train Caught Fire Today : "శనివారం ఉదయం 5:45 గంటలకు ఉద్యాన్​ ఎక్​ప్రెస్​ బెంగళూరు చేరుకుని ప్లాట్‌ఫారమ్-3 వద్ద ఆగింది. సుమారు 7:10 గంటల ప్రాంతంలో రైలులోని B1, B2 కోచ్​లతో ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పివేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఘటనకు గల కారణాలపై విచారణ జరుపుతున్నాం" అని బెంగళూరు రైల్వే అధికారులు తెలిపారు.
Last Updated : Aug 19, 2023, 10:52 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.