లాలూ గదిలో అగ్నిప్రమాదం.. అల్పాహారం చేస్తుండగా మంటలు చెలరేగి.. - లాలూ ప్రసాద్ యాదవ్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 7, 2022, 10:33 AM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

Lalu Prasad Yadav fire accident: ఝార్ఖండ్​ పలామూ జిల్లాలోని ప్రభుత్వ అతిథి గృహంలో మంటలు చెలరేగాయి. ఆర్​జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి ఉంటున్న గదిలోనే ఈ ఘటన జరిగింది. అయితే, లాలూ ప్రసాద్ యాదవ్​కు ఎలాంటి అపాయం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం పలామూకు వెళ్లిన లాలూ.. స్థానిక అతిథి గృహంలో విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో లాలూ గదిలోని ఫ్యాన్​లో మంగళవారం ఉదయం 8.45 గంటలకు మంటలు చెలరేగాయి. దీంతో అతిథి గృహం సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అనంతరం, ఫ్యాన్​ను గోడ నుంచి తొలగించి బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో లాలూ అల్పాహారం సేవిస్తున్నట్లు తెలిసింది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.